Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారు గనుల అన్వేషణపై సింగరేణి 20.!

బంగారు గనుల అన్వేషణపై సింగరేణి 20.!

వార్త 3 weeks ago

Kothagudem Singareni : తెలంగాణ ప్రాచీన నల్లబంగారం బొగ్గు వెలికితీతకే దశాబ్దాలుగా పరిమితమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన వ్యాపార సరళిని సరికొత్త మార్గంలోకి మళ్లించింది.

బొగ్గు తవ్వకాలతో పాటు ఇతర విలువైన ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించిన సంస్థ, తాజాగా బంగారు గనులన్వేషణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ వేలం పాటలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ‘దేవదుర్గ గోల్డ్ అండ్ కాపర్ ఎక్స్‌ప్లోరేషన్ బ్లాక్’ను సింగరేణి విజయవంతంగా దక్కించుకుంది. రూ. 90 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో కర్ణాటక మైనింగ్ శాఖ సహాయంతో సమగ్ర సర్వేను, నిక్షేప పరిశోధన పనులను ప్రారంభించింది.

ఆదాయ మార్గాల విస్తరణ మరియు రాయల్టీ ప్రయోజనాలు

మారుతున్న మార్కెట్ అవసరాలు, సంప్రదాయేతర శక్తి వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో తన ఉనికిని వ్యాపార రీత్యా బలోపేతం చేసుకునేందుకు సింగరేణి ఈ మైనింగ్ విస్తరణ చేపట్టింది. ఈ అన్వేషణ విజయవంతమై ఖనిజాల తవ్వకం ప్రారంభమైతే, దేవదుర్గ గోల్డ్ అండ్ కాపర్ బ్లాక్ ప్రాజెక్ట్ ద్వారా సింగరేణి సంస్థకు ఏకంగా 37.75 శాతం భారీ రాయల్టీ వాటా లభించనుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బంగారం, రాగి వంటి విలువైన ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం ద్వారా సింగరేణి సంస్థ ఆర్థిక బలాన్ని, లాభదాయకతను గణనీయంగా పెంచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడనుంది.

సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. 'ఈరోజు రాజకీయాలు మాట్లాడను'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha