Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగ్లాకు తరలిపోతున్న వలస ఓట్లు!

బంగ్లాకు తరలిపోతున్న వలస ఓట్లు!

వార్త 1 week ago

Immigrant votes : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య మంత్రి మమత బెనర్జీ ఓట్లన్నీ బంగ్లాదేశ్కు తరలిపోతున్నాయి. భారతదేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్ చొరబాటు దార్లను ప్రభుత్వం వెనక్కు పంపించే పని మొదలు పెట్టడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా సరిహద్దులో ఉద్రిక్తతలను నివారించడానికి జూన్ 8వ తేదీన న్యూఢిల్లీలో డైరక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరపాలని భారత్, బంగ్లా నిర్ణయించాయి. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చొరబాట్లను నివారించడానికి కంచె నిర్మాణం ప్రారంభించారు. దీనితోబాటు మూడంచెలుగా ‘అక్రమ వలసదార్లను గుర్తించడం, ఫేక్ గుర్తింపు కార్డుల రద్దు, దేశ బహిష్కరణ’ కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా వేలాది మంది చొరబాటుదార్లు బంగ్లాదేశ్లోని సొంత గ్రామాలకు వెళ్లడానికి సరిహద్దులోని హకీంపూర్ దగ్గరికి చేరుకుంటున్నారు. విశేషమేమంటే వీరంతా స్వచ్చం దంగానే స్వదేశానికి వెళ్పోతున్నారు. సరిహద్దులో కంచె వేయడానికి పశ్చిమ బెంగాల్ అధికారులు ప్రయత్నించగా చొరబాటు దార్ల నుంచి, బిజిబి సిబ్బంది నుంచి హింసాత్మక ప్రతిఘటనలు ఎదురయ్యాయి. దీనితో కంచె వేయాల్సిన సుమారు 142 ఎకరాల భూభాగాన్ని (600 కిలోమీటర్ల దూరం) సరిహద్దు భద్రతా దళానికి (బిఎస్ ఎఫ్) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అప్పగించారు.

Read Also : Transit Visa Difficulties: జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..నేటినుంచి తీరనున్న ట్రాన్సిట్ వీసా కష్టాలు

 Immigrant votes

Immigrant votes : చొరబాటు దార్లను పంపించే ప్రక్రియ

సరిహద్దులోని కూచ్ బీహార్, జుల్పాయ్ గురి, డార్జిలింగ్, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, మాల్డా, ముర్పీ దాబాద్, నదియా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో ఫెన్సింగ్ వేయాల్సిన ఈ భూభాగం విస్తరించి ఉంది. భారత్ బంగ్లా మధ్య 4వేల 96 కిలోమీటర్ల సరిహద్దుఉంది. ఇప్పటివరకూ 3 వేల 232 కిలోమీటర్ల కంచె నిర్మించారు. 174 కిలో మీటర్ల దూరం కంచె నిర్మించడానికి అవకాశం లేదు. సుమారు 600 కిలోమీటర్ల మేర మాత్రం కంచె నిర్మిస్తు న్నారు. మమత బెనర్జీ అధికారంలో ఉన్నంతకాలం కంచె నిర్మించడానికి అనుమతి ఇవ్వలేదు. బిజెపి నేత సువేందు అధికారి ముఖ్యమంత్రి కావడంతో కంచె నిర్మాణంతోబాటు చొరబాటు దార్లను పంపించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ సుమారు 30 లక్షల మంది చొరబాటుదార్లు బంగ్లాదేశ్కు వెళ్లిపోయారని అంచనా. మరో ఇరవై లక్షల మంది తమ దేశం వెళ్లిపోడానికి మూటాముల్లె సర్దుకుని సరిహద్దు దగ్గరికి చేరుకుంటున్నారు. చొరబాటుదార్లను గుర్తించడానికి మాల్టా, ముర్షిదాబాద్ జిల్లాల్లో చొరబాటుదార్ల శిబిరాలను ఏర్పాటు చేసారు. అంతర్జాతీయ చట్టాలకు అను గుణంగానే చొరబాటు దారులను పంపించి వేయడానికి భారత్ ప్రయత్నిస్తోంది. పాస్పోర్ట్, వీసా, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇతర డాక్యుమెంట్లు, వారి స్టేట్మెంట్లు, చుట్టుపక్కల వారి నుంచి, ఇంటెలిజెన్స్నుంచి సేకరించిన సమాచారం ఆధారంతో చొరబాటుదార్లను గుర్తిస్తున్నారు. ఇలా ఉండగా చొరబాటుదార్లను బలవంతంగా పంపించి వేయకూడదని, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలని బంగ్లాదేశ్ కోరుతోంది. దౌత్య మార్గాల ద్వారానే చొరబాటు దార్లను తిరిగి పంపాలని అంటోంది. చొరబాటుదార్లను బలవం తంగా పంపిస్తే తాము ‘తగిన చర్యలు తీసుకుంటామని’ బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి ఖలీలుర్ రహమాన్ భారత్ను హెచ్చిరించారు. కానీ ఇటువంటి సమస్యలు దౌత్యం ద్వారా పరిష్కారం కావని గతంలో రుజువయింది.

భారతదేశంలో ఉండి ప్రయోజనం లేదని..

భారత్ దేశం సుమారు ఐదేళ్ల క్రింతం 2,860 మంది చొరబాటు దార్ల పేర్లను బంగ్లాకు పంపించింది. కానీ వీరి జాతీయతను ఇప్పటికీ బంగ్లా ప్రభుత్వం విచారించి తేల్చలేదు. లక్షలాది మంది గుర్తింపు ఎప్పటికి తేలుతుంది? దీనికి బంగ్లా నుంచి సమాధానం లేదు. అందుకే భారత్ తన దారిలో తను చొరబాటుదార్లను పంపించి వేస్తోంది. చీమ పుట్టల్లా బైట పడుతున్న చొరబాటు దార్లను చూసి ఇంతకాలం వీళ్లు ఎక్కడ ఉన్నారా అని ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. అస్సాంలో 20 లక్షల మంది చొరబాటుదార్లు ఉన్నట్టు అంచనా. కేరళ, తెలంగాణా నుంచి కూడా చొరబాటుదారు లను ఎన్ఐఎ వెనక్కు పంపివేస్తోంది. చొరబాటుదార్లు స్వచ్చందంగా వెనక్కు వెళ్లడానికి భారత ప్రభుత్వ పట్టుదల ప్రధాన కారణం. కాగా మరో మూడు కారణాలు న్నాయి. ఒకటి ఓట్లు లేకపోవడంతో నిన్నటి వరకూ చొరబాటుదార్ల చుట్టూ తిరిగిన రాజకీయ నాయకులు మొహం చాటేస్తున్నా రు. రెండు రేషన్కార్డుతో సహా అన్నిగుర్తింపు కార్డులు రద్దయిపోయాయి. మూడు తమను సమర్ధించే మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో లేదు. ప్రభుత్వం తొలుత అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచుతుంది. తర్వాత మూడేళ్ల వరకూ జైలు తప్పదు. దీనికి తోడు అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటిని భద్రతా సిబంది కూల్చివేస్తున్నారు. ఇక భారతదేశంలో ఉండి ప్రయోజనం లేదని చొరబాటుదార్లే అభిప్రాయపడుతున్నారు. ‘సర్’ నివేదికను బట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షలమంది చొరబాటు దార్లు ఉంటారని అంచనా.

స్థానికుల సంఖ్యతో సమానం

రాష్ట్ర జనాభా కోటి మంది. అంటే స్థానికుల సంఖ్యతో సమానంగా చొరబాటుదార్లు ఉన్నారన్న మాట. దీన్ని బట్టి స్థానికులు ఎన్ని కష్టాలు అనుభవిస్తు న్నారో అర్థం చేసుకోవచ్చు. తమను త్వరగా తమ దేశానికి పంపించి వేయమని చొరబాటుదార్లు వేడు కుంటున్నారు. వీరంతా దళారులకు 5 వేల నుంచి పాతిక వేల వరకూ ఇచ్చి భారతదేశంలోకి చొరబడ్డారు. గుర్తింపు కార్డుల ప్యాకేజిని బట్టి దళారులు వీళ్ల దగ్గర డబ్బులు దం డుకున్నారు. వీళ్లలో ఎక్కువ మంది మైనార్టీలు కావడం, ఓటు బ్యాంక్ పెరుగుతూండటంతో మమతా బెనర్జీ ప్రభు త్వం బహుముఖంగా చొరబాట్లను ప్రోత్సహించింది. వీరిలో ఎక్కువ శాతం గత ఐదేళ్లలో భారత దేశానికి వచ్చినవారే. వీరు చిన్న కూలీపని నుంచి లక్షల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు. సరిహద్దులో చొరబాటుదార్లు ప్రత్యేక కాలనీలు కూడా కట్టుకున్నారు. పదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశించిన చొరబాటు దార్ల దగ్గర కూడా బంగ్లాదేశ్ నేష నల్ఐడెంటిటీ కార్డులు (గుర్తింపు కార్డులు) ఉండటం గమ నార్హం. వీటిని చూపించి చొరబాటుదార్లు తిరిగి బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోతున్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉండటంతో రెండు దేశాల మధ్య డైరక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక సమావేశం జూన్ 8 న్యూఢిల్లీలో జరపాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎస్పి) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సమావేశం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.

 Immigrant votes

భారత్ ధర్మసత్రం కాదు

సరిహద్దులో సహకారం, నేరాల నియంత్రణ కోసం రెండు దేశాల మధ్య డిజి స్థాయి సమావేశాలు 1975లో ప్రారంభమయ్యాయి. 1993 నాటి నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి సమా వేశాలు జరిగేవి. ఒకసారి ఢాకాలో, మరోసారి న్యూఢిల్లీలో నిర్వహించేవారు. జూన్ 8న జరగనున్న సమావేశంలో బంగ్లా తరపున డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహ్మద్ అష్రపుజ్జమాన్ సిద్దిఖి, భారత్ తరపున బిఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొంటారు. చొరబాటు దార్లను గుర్తించడానికి ఎన్నికల కమిషన్ ఓటర్ల ప్రత్యేక గుర్తింపు కార్యక్రమం ‘సర్’ ను నిర్వహించింది. మైనార్టీలను ఏరివేసే మతతత్వ దురుద్దేశంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్ నిర్వహిస్తోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో రాద్దాంతం చేసారు. చొరబాటుదార్ల ఓట్ల బ్యాంక్ను కాపాడుకోడానికి త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ నల్లకోటు వేసుకుని సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. సెక్యులరిజం కాపాడుతామని చెప్పే మేధావులు సర్ కార్యక్రమానికి మతతత్వం అంట గట్టేసారు. పిటిషన్లతో విసిగిపోయిన సుప్రీం కోర్టు కూడా చివాట్లు పెట్టి ‘వచ్చి పోయేవారికి భారత్ ధర్మసత్రం కాదని తేల్చేసింది. అయినా మనవాళ్లు మతతత్వ వాదన మానుకో లేదు. లక్షలాది మంది చొరబాటు దార్లు బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లడం చూసి వీరంతా ఏమంటారో చూడాలి.

-సరికొండ రవీంద్రనాథ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫీజులు భారీగా పెంచినా తగ్గని H-1B క్రేజ్.. లక్షల్లో దరఖాస్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha