Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

వార్త 4 months ago

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మిమెన్‌సింగ్‌ జిల్లాలో సోమవారం ససేన్ చంద్రశేఖర్‌ (62) అనే హిందూ వ్యాపారి తన బియ్యం దుకాణంలో ఉన్నారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆయనపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వ్యాపారి మృతిచెందడంతో దుండగులు ఎవరికీ అనుమానం రావొద్దని ఆ బట్టల షాప్‌ మూసివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దుకాణానికి రాగా.. అతడిని చూసి షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

వరుసగా హిందువులపై దాడులు

చంద్రశేఖర్‌ను ఆ దుండగులు ఎందుకు హత్య చేశారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హిందూ వ్యాపారిపై హత్య చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా హిందువులపై అక్కడ దాడులు, హత్యలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ అక్కడి హిందువులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha