కవిత పార్టీ ట్వీట్ వైరల్
Political twitter war : కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేసింది.
“పూసుకున్నోళ్లకు పూసుకున్నంత” అంటూ బర్నాల్ ఫొటోను షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
బీఆర్ఎస్ ట్వీట్‌కు కౌంటర్
ఇదివరకు భారత రాష్ట్ర సమితి “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే” అంటూ ట్వీట్ చేసింది. ఒరిజినల్, డూప్లికేట్ వస్తువులను పోల్చుతూ చేసిన ఈ పోస్టుకు ప్రతిస్పందనగా కవిత పార్టీ ఈ బర్నాల్ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.
Read Also:Manipur Violence 2026 :ఉక్రుల్ జిల్లాలో ఘర్షణలు.. ముగ్గురు మృతి
రాజకీయంగా చర్చనీయాంశం
కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించిన తర్వాత ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. (Political twitter war) పాత టీఆర్ఎస్ పేరుతో సమానంగా ఉండేలా కొత్త పార్టీని ప్రకటించడం, దానిపై వచ్చిన ప్రతిస్పందనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

