Manchu Manoj: తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్ కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం నిర్వహించిన అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ కొత్త సామాజిక సేవా సంస్థ 'ఐక్య ధైర్య సేన సమితి'ని అధికారికంగా ప్రారంభించారు మనోజ్ దంపతులు.
'Unity, Courage, Service, Impact' అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు పలువురు అభిమానులు, ప్రముఖులు హాజరయ్యారు.
Manchu Manoj’s birthday special is a great decision
ఈ కార్యక్రమంలో తనకు ఈ ఆలోచన ఎలా, ఎందుకు వచ్చిందో మనోజ్ తెలియజేశారు. ''సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థ పేరు 'ఐక్య ధైర్య సేన సమితి'ని మా సోదరుడు, సన్నిహితుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం.ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. అని మంచు మనోజ్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కవాడిగూడ స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త!

