Dailyhunt
బరువు తగ్గించే మిర్చి ఆకులు.. షుగర్ కంట్రోల్ కు అద్భుత ఔషధం!

బరువు తగ్గించే మిర్చి ఆకులు.. షుగర్ కంట్రోల్ కు అద్భుత ఔషధం!

వార్త 5 days ago

Health Tips: ప్రకృతి ప్రసాదించిన మిర్చి ఆకులు శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) సమర్థవంతంగా నియంత్రించాలనుకునే వారికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.

Read Also : Weight loss : అన్నం తింటూనే బరువు తగ్గడం ఎలా?

విటమిన్ల నిధి – రోగనిరోధక శక్తి

మిర్చి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుండి కాపాడుతాయి. రక్తపోటును (Blood pressure) అదుపులో ఉంచడం ద్వారా ఈ ఆకులు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

ఆహారంలో తీసుకునే విధానం

మిర్చి ఆకులను కేవలం ఔషధంగానే కాకుండా, రుచికరమైన వంటకాల రూపంలోనూ తీసుకోవచ్చు. వీటిని పప్పు, రకరకాల వేపుళ్లు, సూప్‌లు లేదా చట్నీల తయారీలో ఆకుకూరలా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిర్చి ఆకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అల్సర్ సమస్యలతో బాధపడేవారు వీటిని నేరుగా తీసుకోకుండా, వైద్యుల సలహా మేరకు తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha