Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్సు ప్రమాదం. వెలుగులోకి వస్తున్న బాధితుల వివరాలు

బస్సు ప్రమాదం. వెలుగులోకి వస్తున్న బాధితుల వివరాలు

వార్త 3 months ago

Markapuram Bus Accident: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామరావుపల్లెకు చెందిన ఉప్పు రమా (55) ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

అలాగే, అయోధ్యకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి కూడా ఈ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉప్పు కిరణ్‌, తుపాకుల రత్నమ్మలు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

కోరుట్ల నుంచి మొదలైన ప్రయాణం

బాధితులంతా జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి బస్సు ఎక్కినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మార్గమధ్యలోనే అగ్నికి ఆహుతవ్వడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా చాలామంది మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.

 Details of victims coming to light

విచారణ వేగవంతం

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల జాబితాను (Reservation Chart) ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఘోరం.. మార్కాపురం బస్సు ప్రమాదంలో గర్భిణి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha