Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్తాకు 6 కిలోల మోసం.. రాజీవ్ రహదారిపై రైతుల యుద్ధం!

బస్తాకు 6 కిలోల మోసం.. రాజీవ్ రహదారిపై రైతుల యుద్ధం!

వార్త 1 week ago

Regulapalli farmers protest : రేగులపల్లి రాజీవ్ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 100 మంది రైతులు రోడ్డుపై బైఠాయించారు.

తూకంలో జరుగుతున్న అవకతవకలు, అధికారుల జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

తూకంలో భారీ మోసం.. ఆందోళనలో రైతులు

కుమ్మరి శ్రవణ్ అనే రైతు వద్ద ధాన్యం తూకం వేసే సమయంలో ఈ అక్రమం బయటపడింది. నిబంధనల ప్రకారం బస్తాకు 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా, ఏకంగా బస్తాకు 6 కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నట్లు రైతులు గుర్తించారు. కష్టపడి పండించిన పంటను తూకం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Read Also:Kalyandurgam MLA : మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు

 Regulapalli farmers protest

రంగంలోకి పోలీసులు.. రైతులకు భరోసా

రాస్తారోకో సమాచారం అందుకున్న ఎస్సై తోట తిరుపతి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి, తూకంలో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సై భరోసాతో రైతులు శాంతించి ఆందోళన విరమించడంతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha