Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్టాండ్‌లో దారుణం.. రెండు బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం

బస్టాండ్‌లో దారుణం.. రెండు బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం

వార్త 2 weeks ago

Uttar Pradesh incident: బస్టాండ్‌లో డ్రైవర్ల బాధ్యతా రాహిత్యం, తీవ్ర నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బస్సు ఎక్కేందుకు వెళ్తున్న క్రమంలో రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ అనే మహిళ ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రోజున కంపెనీ అధికారిక మీటింగ్ కోసం ఉన్నావ్‌లోని బాంగర్‌మౌ వెళ్లేందుకు ఆమె హర్దోయ్ బస్టాండ్‌కు చేరుకుంది.

Read Also : Mumbai police threat: ముంబైలో సంచలనం రేపిన పోలీసు బెదిరింపు

 Horrific incident at bus stand: Woman crushed to death between two buses.

Uttar Pradesh incident: ఒకేసారి ముందుకొచ్చిన బస్సులు.. తీవ్ర గాయాలతో మృతి!

నేహా సింగ్ బస్సు ఎక్కడం కోసం నడుచుకుంటూ వెళుతున్న సమయంలో హర్దోయ్, కన్నౌజ్ డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు అజాగ్రత్తగా ఒకేసారి బస్సులను ముందుకు తీశారు. దీంతో ఊహించని విధంగా ఆ రెండు బస్సుల ముందు భాగాల మధ్య నేహా తీవ్రంగా నలిగిపోయి తీవ్రగాయాలపాలైంది.

గమనించిన స్థానికులు, ప్రయాణికులు వెంటనే ఆమెను సమీపంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha