Pune Trekker Death Case Update : సాధారణంగా ఎవరైనా లోయలో పడిపోయినా.. ఇంకా బతికే ఉన్నారని తెలిస్తే వారి ఆప్తులకు మనసు ఊరట చెందుతుంది. కానీ.. కేతన్ బతికే ఉన్నాడని చెప్పిన సమయంలో సియా గోయల్ కంగారుపడిపోయిందని సమాచారం.
దీనికి సంబంధించిన విషయాన్ని లోహగఢ్ కోట సిబ్బంది ఒకరు వెల్లడించారని న్యూస్18 కథనం ద్వారా తెలుస్తున్నది. కేతన్ లోయలో పడిపోయిన తర్వాత సహాయ సిబ్బంది అతను బతికే ఉన్నాడని చెప్పినప్పుడు సంతోషించడానికి బదులు కంగారుపడిపోయిందని ఆయన వెల్లడించినట్టు సమాచారం. జూన్ 18వ తేదీన ఘటన సమయంలో సియా పెద్ద పెట్టున అరచిందని రాహుల్ అనే స్థానిక పోలీసు అధికారి తెలిపారు. తాము ఘటనాస్థలానికి వెళ్లినప్పుడు ఫొటోలు తీస్తూ కేతన్ పడిపోయాడని సియా చెప్పిందని, అయితే ఆ సమయంలో తీవ్ర ఆందోళనగా కనిపించినప్పటికీ ఆమె కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా లేదని ఆయన చెప్పినట్టు న్యూస్18 మరాఠీ తెలిపింది.
Read Also: Cow Attack : వీధి ఆవు దాడిలో ఢిల్లీ బీజేపీ కౌన్సిలర్‌కు తీవ్ర గాయాలు
Pune Trekker Death Case Update
Pune Trekker Death Case Update : కేఫ్‌లో కలుసుకొని ప్లానింగ్
ఘటనకు ముందు చేతన్, సియా ఒక కేఫ్‌లో కలుసుకొని, కేతన్‌ను చంపేందుకు ప్లాన్‌పై డిస్కస్ చేశారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అతడిని చంపేందుకు జూన్ 16, 17 తేదీల మధ్య ప్లాన్ ఫైనల్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తమ ప్లాన్ అమలు చేసేందుకు కేతన్ అగర్వాల్‌ను సియా.. తన పుట్టినరోజు వేడుక పేరిట లోహగఢ్‌కు తీసుకుని వెళ్లింది. అప్పటికే చేతన్ చౌదరి అక్కడకు చేరుకుని, సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. చేతన్ చౌదరి మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ జూన్ 18వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల వరకూ స్విచాఫ్ అయి ఉందని పోలీసులు తెలిపారు. తను ఎక్కడ ఉన్నదీ లొకేషన్ రికార్డ్ కాకుండా ఉండేందుకు తన సొంత ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగానే తన దుకాణంలో వదిలేసి, అక్కడి ఉద్యోగి ఫోన్‌ను తీసుకుని ఘటనాస్థలానికి చేరుకున్నట్టు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com

