Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్

BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్

వార్త 4 months ago

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారత్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించింది.

వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే కోరింది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ జట్టు T20 వరల్డ్ కప్ మ్యాచులను భారత్‌లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో చివరిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకుంది.

T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు

భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.. మూడు కోల్ కతాలో, ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్ కతాలో మ్యాచ్ లు, ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha