BCCI Girlfriend Culture IPL: ఐపీఎల్ 2026 సీజన్ సాగుతుండగా, మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై బిసిసిఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో బహిరంగంగా తిరగడం, వారితో కలిసి ప్రయాణాలు చేయడంపై బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: IPL 2026 PBKS Vs GT : పంజాబ్ పై గుజరాత్ విజయం
BCCI warning on IPL players girlfriend culture 2026
BCCI Girlfriend Culture IPL: నిబంధనలు ఇవే
బోర్డు ఉన్నత స్థాయి అధికారి ఒకరు దీనిపై స్పష్టతనిస్తూ.. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లతో పాటు కేవలం వారి భార్యలు, తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు మాత్రమే హోటల్ బసలో, ప్రయాణాల్లో అనుమతి ఉంటుందని తెలిపారు. “అధికారిక గర్ల్‌ఫ్రెండ్” (Official Girlfriend) అనే హోదా లేదా నిబంధన బోర్డులో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ ధోరణి ఆట సమగ్రతను దెబ్బతీస్తుందని, లీగ్ ప్రతిష్టను మసకబార్చుతుందని బోర్డు భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

