Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
B.Ed student suicide: రైల్వే కోడూరులో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం

B.Ed student suicide: రైల్వే కోడూరులో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం

వార్త 3 months ago

B.Ed student suicide: ఆంధ్రప్రదేశ్ లోని, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆమంచి భార్గవి (24) అనే యువతి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది.

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదువుతున్న యువతి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

Medak Crime News: భార్యను గొంతు కోసి చంపి భర్త పరార్

రంగంలోకి పోలీసులు.. పోస్టుమార్టంకు తరలింపు

స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు రైల్వే కోడూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాల్రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha