Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్యం గెలిచింది: ఎంపీ నవనీత్

బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్యం గెలిచింది: ఎంపీ నవనీత్

వార్త 1 month ago

West Bengal: బెంగాల్ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌పై బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఘాటుగా స్పందించారు. మమతా బెనర్జీ గతంలో వాడిన 'ఖేలా హోబే' నినాదాన్నే తిరగేసి ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించారు.

బెంగాల్‌లో దీదీ ఆడిన హింసాత్మక రాజకీయాల ఆట ముగిసిందని, ఇకపై అక్కడ అభివృద్ధి (వికాస్) జమానా మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు.

Read Also: Nara Lokesh congratulates Vijay: TVK విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

నాడు అరాచకం.. నేడు ప్రజాస్వామ్య విజయం!

టీఎంసీ పాలనలో బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నవనీత్ కౌర్ ఆరోపించారు. అవినీతి, మహిళలపై అకృత్యాలు మితిమీరిపోయాయని, ఆ నియంతృత్వ ధోరణికి ప్రజలు బ్యాలెట్ ద్వారా సరైన బుద్ధి చెప్పారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, వారంతా తిరిగి పారిపోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.

మోదీ నాయకత్వంపై ప్రజల నమ్మకం

ప్రధాని మోదీ అందించిన సుపరిపాలన, అభివృద్ధిపై బెంగాల్ ఓటర్లు ఉంచిన అచంచలమైన నమ్మకమే ఈ భారీ ఆధిక్యానికి కారణమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారని, ఈ ఫలితాలు దేశ ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప విజయమని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

12 రౌండ్ల పోలింగ్ తర్వాత తగ్గుతున్న మమతా బెనర్జీ ఆధిక్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha