Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరు - హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC శుభవార్త

బెంగళూరు - హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC శుభవార్త

వార్త 3 weeks ago

Bangalore to Hyderabad bus:పెరిగిన బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు. బెంగళూరు రూట్లో TGSRTC కొత్త స్టాప్‌లు. బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది.

ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను, రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్ ) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు తమకు నచ్చిన, దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు మరియు దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించారు.

Read also: Indiramma houses hyderabad: గూడు లేని పేదలకు తీపి కబురు

బెంగళూరులో బోర్డింగ్ & అలైటింగ్ పాయింట్ల వివరాలు

వివిధ రూట్లలో నడిచే బస్సులను బట్టి బెంగళూరు నగరంలో స్టాప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి

పీనియా రూట్ (via Peenya): పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ (Yeshwanthpur Metro Station), కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్ (Hebbal), ఎస్టీమ్ మాల్ (Esteem Mall), ఎలాహంక (Yelahanka), బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్. చందాపూర్ రూట్ (via Chandapura) : చందాపూర్, బొమ్మసంద్ర (Bommasandra), ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City), బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ (Madiwala), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్. మార్తహళ్లి రూట్ (via Marathahalli): వర్తూర్ జంక్షన్ (Varthur Junction), మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి (Domlur Bridge), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.

Bangalore to Hyderabad bus:హైదరాబాద్‌లో బోర్డింగ్ & అలైటింగ్ పాయింట్ల వివరాలు

బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయి. పటాన్‌చెరు రూట్ : పటాన్‌చెరు నుండి ఎంజీబీఎస్ (MGBS), ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో.. జేబీఎస్ రూట్: జేబీఎస్ (JBS) నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో.. హయత్ నగర్ రూట్: హయత్ నగర్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు కలవు. టీజీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. మీ ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఎంచుకుని, సురక్షితమైన మరియు సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని యాజమాన్యం సూచించింది. ముందస్తు బుకింగ్స్ మరియు ఇతర వివరాల కోసం ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవడానికి టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ను సందర్శించగలరు.

Epaper: epaper.vaartha.com

విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన సునీల్ మిట్టల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha