Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్

Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్

వార్త 3 months ago

బెంగళూరు సిటీలో ఒక కన్నడ టీవీ నటికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరులోని ఒక ప్రముఖ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌కు సదరు కన్నడ టీవీ నటి హాజరయ్యారు.

ఆ సమయంలో ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా, ఆ వీడియోను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా పంపించి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన వద్ద ఉన్న వీడియోను బయటపెట్టకూడదంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సదరు వ్యక్తి ఆమెను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాడు.

Pratyusha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రత్యూష తల్లి

ఈ వేధింపులపై బాధితురాలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా స్పందించారు. వెంటనే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తన ఫిర్యాదును అందజేశారు. తనకు వచ్చిన సందేశాలు, వీడియో ఆధారాలను పోలీసులకు సమర్పించారు. నిందితుడు ఆమెను మానసికంగా వేధిస్తున్నాడని, డబ్బుల కోసం పదేపదే ఒత్తిడి చేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇండోర్ స్టేడియంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha