Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరులో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

బెంగళూరులో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

వార్త 3 weeks ago

Indigo Flight: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. గువాహటి నుంచి ప్రయాణికులతో వచ్చిన ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం రన్‌వేపై ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో 'టెయిల్ స్ట్రైక్' (Tail Strike) ఘటన చోటుచేసుకుంది.

ల్యాండింగ్ సమయంలో అనూహ్యంగా విమానం వెనుక భాగం రన్‌వేను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

బలమైన గాలుల ప్రభావం: గో-అరౌండ్ చేపట్టిన పైలట్లు

ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం మరియు ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో పైలట్లకు ఇబ్బంది ఎదురైంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకడాన్ని వెంటనే గుర్తించిన అప్రమత్తమైన పైలట్లు.. మొదటి ప్రయత్నంలో ల్యాండింగ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. వెంటనే ‘గో-అరౌండ్’ ప్రక్రియను చేపట్టి విమానాన్ని తిరిగి సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లారు.

Indigo Flight: రెండో ప్రయత్నంలో సురక్షిత ల్యాండింగ్: ప్రయాణికులంతా సేఫ్

తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, పైలట్లు ఎంతో సంయమనంతో వ్యవహరించి రెండోసారి అప్రమత్తంగా ల్యాండింగ్ నిర్వహించారు. ఈసారి విమానాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సురక్షితంగా రన్‌వేపై దించారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Epaper: epaper.vaartha.com

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha