Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెర్ముడా వెనుక ఉన్న అసలు భౌగోళిక రహస్యం.. చాన్నాళ్ల మిస్టరీకి తెరదించిన సైన్స్!

బెర్ముడా వెనుక ఉన్న అసలు భౌగోళిక రహస్యం.. చాన్నాళ్ల మిస్టరీకి తెరదించిన సైన్స్!

వార్త 1 week ago

Bermuda Triangle Mystery: అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా ప్రాంతం అనగానే ఇప్పటివరకు కేవలం నిగూఢ శక్తులు, విమానాల అదృశ్యాలు వంటి మిస్టరీ కథలే ప్రచారంలో ఉండేవి.

అయితే, వీటన్నింటినీ పక్కనపెట్టి, దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక భౌగోళిక ప్రశ్నకు సైన్స్ ద్వారా సమాధానం లభించింది. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత ఆయా దీవులు సముద్ర గర్భంలోకి కుంగిపోవాల్సి ఉంటుంది. కానీ బెర్ముడా దీవుల్లో గత 3 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి అగ్నిపర్వత చర్యలు లేకపోయినప్పటికీ, చుట్టుపక్కల ప్రాంతాల కంటే 1,600 అడుగుల ఎత్తులోనే స్థిరంగా కొనసాగుతోంది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ మరియు యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధనలు చేశారు.

Bermuda Triangle Mystery:రహస్యాన్ని ఛేదించిన పరిశోధన

భూకంప తరంగాల (సైస్మిక్ వేవ్స్) డేటాను విశ్లేషించడం ద్వారా బెర్ముడా దీవుల కింద దాదాపు 12 మైళ్ల మందపాటి భారీ శిలాపొర ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ శిల యొక్క సాంద్రత చాలా తక్కువగా ఉండటం వల్ల, ఇది సముద్ర గర్భంలో ఒక సహజమైన ‘బల్లకట్టు’లా మారి పైనున్న దీవులను కిందకు కుంగిపోకుండా పైకే తేలుస్తూ ఉంచుతోంది. భూగర్భ శాస్త్రంలో 'అండర్‌ప్లేటింగ్‌'గా పిలిచే ఈ ప్రక్రియ వల్లే బెర్ముడా దీవులు కోట్ల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచాయని పరిశోధనలో తేలింది. కేవలం ఊహాజనిత కథలకే పరిమితమైన బెర్ముడా వెనుక ఉన్న ఈ అద్భుతమైన భౌగోళిక సత్యాన్ని నిరూపించడంతో అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha