Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'భారత్ ఫ్యూచర్ సిటీ' అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

'భారత్ ఫ్యూచర్ సిటీ' అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

వార్త 4 days ago

Revanth Reddy: తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' సాకారమయ్యేందుకు తొలి అడుగు పడింది.

ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.

Read also: DGP CV Anand: నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్

ఈ చారిత్రాత్మక ఘట్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ..

“ఇది తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆధునిక భారతదేశానికి ఒక రోల్ మోడల్‌గా, నూతన నగరంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది” అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.

రికార్డు సమయంలో నిర్మాణం.. పర్యావరణహిత హంగులు

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయ భవనాన్ని కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే నిర్మించి పూర్తి చేయడం విశేషం. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక హంగులతో, సకల సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారు. పక్కా ప్రణాళిక, అధునాతన సాంకేతికత, మరియు సుస్థిర అభివృద్ధికి (Sustainable Development) ఈ ఫ్యూచర్ సిటీ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలవనుందని సీఎం వెల్లడించారు.

Revanth Reddy: ముందే వరించిన 'నెట్ జీరో' గుర్తింపు

ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ప్రారంభం కాకముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుండి ప్రతిష్ఠాత్మకమైన 'నెట్ జీరో' (Net Zero) భవనంగా గుర్తింపు సాధించింది. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా, పూర్తిగా సహజ వనరుల వినియోగం, పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా ఈ కార్యాలయాన్ని డిజైన్ చేశారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోందని సీఎం స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పెరిగిన కీమోథెరపీ మందుల ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha