Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వకు యూఏఈ సై

భారత్ లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వకు యూఏఈ సై

వార్త 1 week ago

India UAE Oil Agreement 2026: భారతదేశ ఇంధన భద్రతను (Energy Security) మరింత పటిష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా భారత్-యూఏఈ దేశాల మధ్య వ్యూహాత్మకంగా, పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో అత్యంత ప్రధానంగా.. భారతదేశంలోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాలలో (SPR) ఏకంగా 30 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురును (Crude Oil) నిల్వ చేయడానికి యూఏఈ అంగీకరించింది.

Read Also:Strait of Hormuz: ఆర్థిక సంక్షోభంలో పలు దేశాలు ..తీవ్రమైన చమురు, గ్యాస్ కొరత

పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలలో (ముఖ్యంగా హర్మూజ్ జలసంధి) సరఫరా అంతరాయాలు పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం భారత్‌కు రక్షణ కవచంలా మారనుంది.

  • ISPRL – ADNOC ఒప్పందం: ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీల మధ్య ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. దీని ద్వారా మంగళూరుతో పాటు విశాఖపట్నం, చండిఖోల్ కేంద్రాల్లో నిల్వ సామర్థ్యాన్ని విస్తరించనున్నారు.
  • ఎల్‌పీజీ, గ్యాస్ నిల్వలు: ముడి చమురుతో పాటు భారత్‌లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటుకు ఇరుదేశాలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), అడ్నాక్ (ADNOC) మధ్య దీర్ఘకాలిక ఎల్‌పీజీ (LPG) సరఫరా ఒప్పందం కూడా కుదిరింది.

India UAE Oil Agreement 2026: 5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వరద!

ఇంధన రంగంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూఏఈ భారీ పెట్టుబడులను ప్రకటించింది. భారతదేశంలోని బ్యాంకింగ్ (ముఖ్యంగా RBL బ్యాంక్), మౌలిక సదుపాయాల రంగం (Infrastructure), మరియు ఫైనాన్స్ రంగాలలో యూఏఈ దాదాపు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 41 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపింది.

 PM Modi Abu Dhabi Visit May 2026

రక్షణ, ఏఐ రంగాల్లోనూ కీలక అడుగులు

రెండు దేశాల మధ్య సైనిక, సాంకేతిక బంధాన్ని బలోపేతం చేస్తూ ‘వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్’ పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. గుజరాత్‌లోని వాడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుతో పాటు, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి కోసం భారత్-యూఏఈ సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వంపై ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయంగా నిరంతరాయ వాణిజ్యానికి హర్మూజ్ జలసంధి రక్షణ ఎంత ముఖ్యమో ఇరునేతలు నొక్కిచెప్పారు. ఇటీవలి కాలంలో యూఏఈపై జరిగిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండిస్తూ, భారత్ ఎల్లప్పుడూ యూఏఈకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha