Jio : భారతీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో (Reliance Jio) తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. దేశంలో జియో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 524 మిలియన్లకు (52.40 కోట్లు) చేరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా ప్రకటించింది.
2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (FY26 Q4) ఆర్థిక ఫలితాల నివేదికను విడుదల చేసిన సంస్థ, అందులో ఈ సంచలన గణాంకాలను వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అల్ట్రా-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తూ జియో నెట్‌వర్క్‌లో 26.8 కోట్ల మంది యాక్టివ్ 5G వినియోగదారులు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. మొబైల్ రంగంలోనే కాకుండా, జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్ వంటి ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ (Fixed Broadband) సేవల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.71 కోట్ల ఇళ్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను చేరువ చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'ఏఎం/ఎన్ఎస్ ఇండియా' అరుదైన రికార్డు!

పెరిగిన సగటు ఆదాయం – రికార్డు స్థాయిలో డేటా వినియోగిస్తున్న భారతీయులు
మారిన రీఛార్జ్ ప్లాన్ల ధరలు, వినియోగదారుల అవసరాల నేపథ్యంలో జియో తన సగటు ఆదాయాన్ని మరింతగా పెంచుకుంది. నెట్‌వర్క్‌లోని ప్రతి యూజర్ నుంచి కంపెనీకి వచ్చే సగటు నెలవారీ ఆదాయం (ARPU – Average Revenue Per User) ఇప్పుడు రూ. 214 కి చేరినట్లు సంస్థ స్పష్టం చేసింది. డిజిటల్ కంటెంట్ వినియోగం, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు రీల్స్ వంటి వినోద సాధనాల వాడకం పెరగడంతో డేటా వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. జియో నెట్‌వర్క్‌లో ప్రతి ఒక్క వినియోగదారుడు సగటున నెలకు 42.3 GB డేటాను ఖర్చు చేస్తున్నట్లు ఈ క్వార్టర్ నివేదికలో తేలింది. టెలికాం మార్కెట్లో పోటీదారులకు అందనంత ఎత్తులో సబ్‌స్క్రైబర్ల బేస్‌ను పెంచుకుంటూ, 5G కనెక్టివిటీలో గ్లోబల్ లీడర్‌గా జియో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

