Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ లో మరో ఉద్యోమం

భారత్ లో మరో ఉద్యోమం

వార్త 1 week ago

Remove Reservation : సీజేపీ (CJP) ఆందోళనల తదనంతరం, భారతదేశంలో రిజర్వేషన్ల విధానంపై నెట్టింట కొత్త తరహా ఉద్యమం ఊపందుకుంటోంది. 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వర్తమాన విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలులో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, కులంతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమానమైన విద్యా అవకాశాలు దక్కాలని ఈ ప్రచారం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఎలాంటి రాజకీయ ప్రాతిపదిక లేకుండా డిజిటల్ వేదికగా మొదలైన ఈ ఉద్యమానికి స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 34 లక్షలకు పైగా ఫాలోవర్లు లభించడం విశేషం.

చట్టంలో ‘కుల’ ప్రస్తావన తొలగించాలనే డిమాండ్: డిజిటల్ వేదికపై పొంగొత్తుతున్న మద్దతు!

ఈ ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ (RHA) నిర్వాహకులు తాము ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా నిర్దిష్ట వర్గానికి కొమ్ముకాయడం లేదని స్పష్టం చేస్తున్నారు. చట్టాలు, ప్రభుత్వ పాలసీల్లో ఎక్కడా ‘కులం’ అనే ప్రస్తావన రాకుండా, కేవలం ప్రతిభ మరియు ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే అవకాశాలు కల్పించేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని వారు పట్టుబడుతున్నారు. దేశంలోని యువత, విద్యార్థుల నుండి ఈ ఉద్యమానికి నెట్టింట ఊహించని రీతిలో మద్దతు లభిస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ అంశం మరిన్ని సామాజిక, రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్లీ పోరాటమే..కొత్త మంత్రికి సిజేపి ఫస్ట్ వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha