Vivo S2 Price:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన పాపులర్ 'S సిరీస్'ను భారత మార్కెట్లోకి పునఃప్రారంభిస్తూ, ప్రీమియం విభాగంలో 'వివో S2' (Vivo S2) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ప్రీమియం డిజైన్, భారీ బ్యాటరీ, ఐపీ రేటింగ్స్ మరియు సరికొత్త ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు ప్రధాన రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది.
Read Also :Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. ఇదిగో తాజా రేట్లు
వివో S2 (Vivo S2) ప్రధాన ఫీచర్లు & స్పెసిఫికేషన్లు

- డిస్‌ప్లే (Display):
- 6.83-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే.
- 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్.
- 3,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సౌకర్యం.
- ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్:
- మీడియాటెక్ డిమెన్సిటీ 7360 టర్బో (MediaTek Dimensity 7360 Turbo) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
- బ్యాటరీ & చార్జింగ్:
- భారీ 7,050 mAh బ్యాటరీని అందించారు.
- బాక్స్‌లోనే 44W చార్జర్ లభిస్తుంది.
- కెమెరా విభాగాలు:
- బ్యాక్ సైడ్: 50 MP ప్రధాన కెమెరా.
- ఫ్రంట్ సైడ్: సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 MP ఫ్రంట్ కెమెరా.
- వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్:
- వాటర్ మరియు డస్ట్ ప్రొటెక్షన్ కోసం బెస్ట్ ఇన్ క్లాస్ IP68 మరియు IP69K రేటింగ్స్ కలిగి ఉంది.
Vivo S2 Price: రంగులు మరియు ధరల వివరాలు
వివో S2 సిల్క్ వైట్ (Silk White), సఫైర్ బ్లూ (Sapphire Blue) మరియు రీగల్ బ్రాంజ్ (Regal Bronze) అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
- 8 GB RAM / 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర: ₹39,999
- 8 GB RAM / 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర: ₹44,999
మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు

