Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

భారత రాష్ట్రపతి ముర్ముకు నేపాల్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు

వార్త 3 weeks ago

Nepal Floods : నేపాల్ దేశాన్ని ముంచెత్తిన ఆకస్మిక వరదలు, జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపిన వేళ భారత ప్రభుత్వం అందించిన సకాలంలో సహాయం, సంఘీభావంపై నేపాల్ ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కష్టకాలంలో తమకు తోడ్పాటునందించిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. “వరదల విపత్తు వేళ మీ ప్రభుత్వం అందించిన నిరంతర మద్దతుకు, చాటిన సంఘీభావానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 26న సంభవించిన దుర్ఘటనలో పలువురు భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు నేపాల్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

Read Also ; వరదల ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రం సిద్ధం: హిమాచల్ గవర్నర్

 President Droupadi Murmu

ఉధృతంగా సహాయక చర్యలు.. 626కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో సంభవించిన ఈ జలప్రళయం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం అపారంగా సంభవించింది. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం వరదల ధాటికి 626 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 2,000 మందికి పైగా ప్రజలు ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. విపత్తు తీవ్రత దృష్ట్యా రెండు దేశాల సరిహద్దుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేశారు. కొండచరియలు విరిగిపడటం, ప్రధాన మార్గాలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు అవరోధాలు ఏర్పడుతున్నప్పటికీ, బాధితులకు అవసరమైన వైద్యం, ఆహారం మరియు తాత్కాలిక పునరావాస వసతులను అందించడంలో భారత-నేపాల్ బృందాలు సంయుక్తంగా శ్రమిస్తున్నాయి.

ముంబై వాసులకు పాల షాక్: సెప్టెంబర్ 1 నుంచి లీటర్ పాలు రూ. 110

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha