Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత వాలీబాల్ జట్టు చారిత్రక విజయం.. విజయ్ దేవరకొండ పిలుపు

భారత వాలీబాల్ జట్టు చారిత్రక విజయం.. విజయ్ దేవరకొండ పిలుపు

వార్త 3 weeks ago

Indian Volleyball Team: దేశంలోని యువతను క్రీడల దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు సముచిత గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.

చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ, 2026 ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) మెన్స్ కప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం (Bronze Medal) సాధించిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Hardik Pandya: పాండ్యా కోసం 12 రోజుల సైకిల్ యాత్ర.. సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ క్రికెటర్!

 Historic victory for the Indian volleyball team… Vijay Deverakonda’s call.

Indian Volleyball Team: క్రీడాకారులకు భరోసా ఇవ్వడమే నా లక్ష్యం

ప్రస్తుతం దేశంలో ప్రజాదరణ పొందుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ (PVL) లో ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “వాలీబాల్‌ క్రీడల్లో నేను భాగస్వామిని కావడానికి క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రధాన కారణం. దేశంలోని యువతను క్రీడల వైపు మళ్లించడం, మన ఆటగాళ్లకు తగిన గుర్తింపునిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం మనందరి బాధ్యత. మన దేశంలో అపారమైన ప్రతిభ దాగి ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఏవీసీ (AVC) కప్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బలమైన డిఫెండింగ్ ఛాంపియన్ బహ్రెయిన్‌పై 3-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ అరుదైన విజయం దేశంలో క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడకు కూడా ఆదరణ, క్రేజ్ విపరీతంగా పెరుగుతున్నాయనే దానికి నిదర్శనంగా నిలిచింది.

క్రీడల అభివృద్ధిలో భాగస్వామిగా ‘రౌడీ’ హీరో

విజయ్ దేవరకొండ కేవలం వాలీబాల్ జట్టు యజమానిగానే పరిమితం కాకుండా, క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన టీజీ20 (TG20) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ యువ క్రికెటర్లను సైతం ప్రోత్సహిస్తున్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వంటి ప్రొఫెషనల్ లీగ్‌లు భారతదేశంలో క్రికెటేతర క్రీడల్లోని అద్భుతమైన ప్రతిభను వెలికితీయడానికి, క్రీడాకారులకు స్థిరమైన కెరీర్‌ను అందించడానికి ఎంతో దోహదపడతాయని క్రీడా నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Epaper: epaper.vaartha.com

వర్షం ఎఫెక్ట్.. భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20కు ఆటంకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha