India-China Trade: అంతర్జాతీయ విపణిలో భారతీయ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. చైనా విధిస్తున్న పారదర్శకత లేని సుంకేతర అడ్డంకులే మన ఎగుమతులకు ప్రధాన అవరోధంగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా అట్లాంటిక్ కౌన్సిల్ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆమె ప్రసంగించారు. జెనరిక్ మందులు, పశు మాంసం, వ్యవసాయ ఉత్పత్తులతో సహా పలు రంగాలలో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ.. పారిశుధ్య, వృక్ష ఆరోగ్య నిబంధనలు, కఠినమైన నియంత్రణల పేరుతో చైనా.. భారత ఉత్పత్తులను తన మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటోందని ఆర్థికమంత్రి ఆరోపించారు. భారత వ్యాపారులకు చైనా మార్కెట్లో సమాన అవకాశాలు కల్పించాలని గత దశాబ్ద కాలంగా నిరంతరం కోరుతున్నప్పటికీ.. చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి నిర్మలమ్మ వెల్లడించారు.
Brent Crude Oil Price: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల సెగ.. కారణాలివే
India-China Trade
India-China Trade : దౌత్యపరమైన చర్చలకే భారత్ కట్టుబడి వుంది
2015-16 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 52.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2025-26 నాటికి అది ఏకంగా 112 బిలియన్ డాలర్లకు చేరి రెట్టింపు కంటే ఎక్కువైంది. చైనా అనుసరిస్తున్న ఈ మొండి వైఖరిపై ఇతర దేశాల వలె భారత్ వెంటనే ప్రతీకార సుంకాలు విధించకుండా.. సమస్యల పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలకే భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చైనాతో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వాణిజ్యపరమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

