Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారతీయ సంప్రదాయాలకు పెద్ద పీఠం వేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

భారతీయ సంప్రదాయాలకు పెద్ద పీఠం వేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

వార్త 0 months ago

Aditya Birla Group :భారతీయ సంప్రదాయాలు, కళా వారసత్వానికి అద్దం పట్టేలా ఆదిత్య బిర్లా గ్రూప్ జ్యువెలరీ బ్రాండ్ 'ఇంద్రియా' బెంగళూరులోని రాజాజీనగర్ ఒరాయన్ మాల్ మరియు త్యాగరాజనగర్ శ్రీ సత్య గణపతి షిర్డీ సాయిబాబా దేవాలయ ప్రాంగణాల్లో భారీ ఆభరణ రంగవల్లిని ఆవిష్కరించింది.

సంస్థ సరికొత్త పండుగ కలెక్షన్ ‘పద్మిక’ ఆభరణాల డిజైన్ స్ఫూర్తితో సుమారు 1600 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ రంగవల్లిని రూపొందించారు. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో రూపొందిన ఈ పింక్ ఎనామిల్ (గులాబీ మీనాకారీ) నెక్లెస్ డిజైన్‌లో లక్ష్మీదేవి మంగళకర రూపం మరియు నక్షీ పూల చెక్కడాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గిన్నిస్ రికార్డు గ్రహీత, 3D రంగోలి నిపుణురాలు శిఖా శర్మ సారథ్యంలో బియ్యం, రాగులు, కొర్రలు వంటి పర్యావరణహిత చిరుధాన్యాలతో (మిల్లెట్స్) ఈ రంగవల్లిని అత్యంత శ్రద్ధతో తీర్చిదిద్దారు. స్వర్ణాభరణాల తయారీలో ఉండే సూక్ష్మ నైపుణ్యాన్ని, రంగవల్లి కళలోని ఖచ్చితత్వాన్ని ఒకే వేదికపై ప్రదర్శిస్తూ ఈ ప్రదర్శన పండుగ వేళ ప్రజలకు కంటికి ఇంంపైన వినూత్న అనుభూతిని అందించింది.

దిగొస్తున్న కూరగాయల రేట్లు

సుస్థిరత మరియు సామాజిక స్పృహతో కూడిన పండుగ వేడుక

ఈ వినూత్న ప్రాజెక్ట్ కేవలం పండుగ ఆనందానికే పరిమితం కాకుండా పర్యావరణ సుస్థిరతకు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చింది. విజయదశమి వేడుకల అనంతరం రంగవల్లి రూపకల్పనకు ఉపయోగించిన మొత్తం ధాన్యాలు మరియు చిరుధాన్యాలను అఖిల కర్ణాటక ప్రాణి దయా సంఘం గోశాల సహకారంతో పక్షులు మరియు మూగజీవాలకు ఆహారంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన హస్తకళలను సమకాలీన శైలిలో ప్రజలకు చేరువ చేయడమే తమ ఉద్దేశమని ఇంద్రియా మార్కెటింగ్ హెడ్ శాంతిస్వరూప్ పాండా పేర్కొన్నారు. వినియోగదారులు కూడా ఈ పండుగ సంబరంలో భాగస్వాములు అయ్యేలా ప్రత్యేక రంగవల్లి పోటీలను ఆర్గనైజ్ చేస్తూ, పర్యావరణహిత పద్ధతిలో సాంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేసే గొప్ప ప్రయత్నాన్ని ఇంద్రియా సంస్థ సార్థకం చేసుకుంది.

చైనా వీసా ప్రక్రియలో మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha