Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి.. ఇరాన్ వ్యంగ్య పోస్టు

భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి.. ఇరాన్ వ్యంగ్య పోస్టు

వార్త 1 day ago

India US relations : అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా ఇరాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. భారతీయుల నుంచి సభ్యత, మర్యాద నేర్చుకోవాలని సూచిస్తూ ఇరాన్ వ్యంగ్య పోస్టు పెట్టింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం 'ఎక్స్' వేదికగా పోస్టు చేస్తూ భారతీయులలో సభ్యత కనిపిస్తుందని పేర్కొంది. భారత్‌లో పర్యటిస్తున్న మీరు వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలని అమెరికా విదేశాంగమంత్రికి పరోక్షంగా చురకలు అంటించింది. ఈ పోస్టు ఇప్పుడు రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.

భారత్ పర్యటనలో రుబియో

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మార్కో రుబియో నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ముందుగా కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించారు. అనంతరం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.

Read Also : Twisha Sharma: ఎట్టకేలకు పరారీలో ఉన్న ట్విషా శర్మ భర్త లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు: న్యాయవాది

 India US relations

కీలక భేటీలు

భారత్ పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా మార్కో రుబియో సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, భద్రతా అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha