Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్ల ధరలు

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్ల ధరలు

వార్త 1 month ago

Apple iPhone Price: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'ఆపిల్' భారతీయ ఐఫోన్ ప్రియులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్‌లో ఐఫోన్ల ధరలను విపరీతంగా పెంచేసింది.

ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 10 శాతం మేర మాత్రమే ధరలు పెరగగా, భారత్‌లో మాత్రం ఈ పెంపు ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు ఉండటం గమనార్హం. రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయం మరియు దిగుమతి సుంకాలు పెరగడమే ఈ భారీ ధరల పెంపునకు కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : Vijay dairy parlarlu: మహిళలకు విజయ డెయిరీ పార్లర్లు

 iPhone prices have risen sharply in India.

Apple iPhone Price: కొత్త ఐఫోన్ మోడళ్ల ధరలు

భారత మార్కెట్లో కొత్తగా విడుదలైన బేసిక్ మోడల్ ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ. 82,900 నుండి ఏకంగా రూ. 99,900కి చేరింది. ఆపిల్ ప్రవేశపెట్టిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డూ’పై 20% దిగుమతి సుంకం పడటంతో దాని రేటు రూ. 3 లక్షలకు చేరువైంది.

  • ఐఫోన్ 17 (256GB): రూ. 99,900
  • ఐఫోన్ 18 ప్రో (256GB): రూ. 1,64,900
  • ఐఫోన్ 18 ప్రో మాక్స్ (256GB): రూ. 1,79,900
  • ఐఫోన్ ఎయిర్ (256GB): రూ. 1,49,900
  • ఐఫోన్ 17ఈ (256GB): రూ. 79,900
  • ఐఫోన్ డూ (256GB – ఫోల్డబుల్): రూ. 2,99,900

అమెరికాతో పోలిస్తే భారీ వ్యత్యాసం

అమెరికా మార్కెట్‌లోని ధరలతో పోల్చి చూస్తే మన దేశంలో విక్రయిస్తున్న రేట్లు షాకింగ్‌గా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర భారత కరెన్సీలో రూ. 1,13,905 ఉండగా, భారత్‌లో దాని ధర రూ. 1,64,900గా నిర్ణయించారు. అంటే మన దేశ కొనుగోలుదారులపై రూ. 50 వేల వరకు అదనపు భారం పడుతోంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర అమెరికాలో రూ. 1,23,405 కాగా, భారత్‌లో రూ. 1,79,900గా ఉంది.

పండుగ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం

దిగుమతి సుంకాలు, పెరిగిన రేట్ల వల్ల ఈ పండుగ సీజన్ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఫోన్ కొనుగోలుకు రూ. 2 లక్షల వరకు వెచ్చించాల్సి రావడంతో కొనుగోలుదారులు పాత మోడళ్ల వైపు లేదా ఐఫోన్ 17 వైపు మొగ్గు చూపుతున్నారు.

మళ్లీ భగ్గుమంటున్న క్రూడాయిల్ ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha