Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో స్వైన్‌ ఫ్లూ కలకలం.. 17 రోజుల్లోనే 1,268 కొత్త కేసులు

భారత్‌లో స్వైన్‌ ఫ్లూ కలకలం.. 17 రోజుల్లోనే 1,268 కొత్త కేసులు

వార్త 3 weeks ago

Swine Flu: వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా హెచ్1ఎన్1 (H1N1) వైరస్ లేదా స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా విస్తరిస్తుండటం పట్ల వైద్య ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఫ్లూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో నమోవుతున్న గణాంకాలు మరియు పరిస్థితులు

దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే 1,268 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూడటంతో, మొత్తం బాధితుల సంఖ్య 2,612కి చేరింది. ఇదే సమయంలో అక్కడ 3,300లకు పైగా ఇన్ఫ్లుఎంజా-ఎ కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు కర్ణాటకలో 4,212 కేసులు, మహారాష్ట్రలో 1,109 కేసులు (ముంబై, పూణే ప్రాంతాల్లో అత్యధికం) నమోదయ్యాయి. యూపీలోని లక్నోలో ఓ మహిళ మృతి చెందడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రులను అధికారులు హై అలర్ట్ చేశారు.

ఇది కొత్త స్ట్రెయిన్ కాదు – స్పష్టం చేసిన ICMR

దేశంలో ప్రబలుతున్న ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ స్పష్టం చేశారు. ఇవి ఎలాంటి కొత్త రకం స్ట్రెయిన్లు కాదని, ప్రతి సంవత్సరం సాధారణంగా వచ్చే సీజనల్ ‘H1N1 pdm09’ వైరసేనని తెలిపారు. తగిన చికిత్స తీసుకుంటే ఇవి పూర్తిగా నయమవుతాయని పేర్కొన్నారు. అయితే కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఫ్లూ వ్యాక్సిన్ల వినియోగం, డిమాండ్ దాదాపు మూడు రెట్లు పెరిగింది.

Swine Flu: స్వైన్ ఫ్లూ లక్షణాలు మరియు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు

ఈ సీజనల్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • ప్రధాన లక్షణాలు: అధిక జ్వరం, తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చలి మరియు తీవ్రమైన అలసట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • జాగ్రత్తలు: రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. వయోవృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం చేసుకోకూడదు.

ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha