Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'భారత్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతుంది': రాహుల్ గాంధీ

'భారత్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతుంది': రాహుల్ గాంధీ

వార్త 5 days ago

భారతదేశంలో ఎవరూ అడ్డుకోలేనంతటి అత్యంత భయంకరమైన ఆర్థిక తుపాను రాబోతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విఫల ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోందని, దీనివల్ల సంభవించే భారీ నష్టాన్ని దేశంలోని సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో జరిగిన ఒక సభలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఆర్థిక సంక్షోభం వల్ల కార్పొరేట్ దిగ్గజాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని రాహుల్ గాంధీ విమర్శించారు. “ఆర్థిక తుపాను దెబ్బ అంబానీ, అదానీలకు తగలదు. వారు తమ సురక్షితమైన ప్యాలెస్‌లలో కూర్చుని ఉంటారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం వల్ల భారత రైతులు, కార్మికులు, యువత, చిన్న వ్యాపారస్థులు మరియు ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకబోతోందని, పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయని హెచ్చరించారు.

Read Also: Apache Choppers: అపాచీ హెలికాప్టర్లు, హోవిట్జర్ల కోసం $428 మిలియన్ల అమెరికా ప్యాకేజీకి ఆమోదం!

 Rahul Gandhi

Rahul Gandhi: ఇరాన్-అమెరికా యుద్ధం.. పెట్రోల్ కొరతపై మోదీ వ్యూహం తప్పు!

అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఇరాన్ మన దేశానికి ఇంధన సరఫరాలను నిలిపివేసిందని, దీనివల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. “సమస్య పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలతో కాదు, ద్రవ్యోల్బణంతో ఉందని ప్రధాని మోదీ గ్రహించాలి. ప్రజలను పెట్రోల్ పొదుపుగా వాడమని, ఈవీ వాహనాలకు మారమని సలహాలిస్తున్న ప్రధాని.. మరుసటి రోజే తాను మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు” అని రాహుల్ విమర్శించారు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని మార్చకపోతే దేశం ఆర్థికంగా కోలుకోలేదని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో రాజకీయ అవగాహన లోపించడం వల్లే ఉపాధి హామీ (MGNREGA) వంటి గ్రామీణ సామాజిక భద్రతా పథకాలు రద్దయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో సామాన్యుల జేబుల నుంచి డబ్బులు దోచుకుని క్రోనీ క్యాపిటలిస్టులకు అప్పగిస్తున్నారని, దేశ ప్రజలు ఆర్థికంగా నాశనమవుతుంటే పాలకులందరూ కార్పొరేట్ పెళ్లిళ్లకు హాజరవుతూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన రాహుల్ గాంధీకి లఖ్‌నవూ విమానాశ్రయంలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ సహా పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha