Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్

భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్

వార్త 3 weeks ago

Trump targets with tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump అనుసరిస్తున్న వాణిజ్య విధానం గ్లోబల్ ఎకానమీ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తోంది.

సుంకాలను (Tariffs) కేవలం దిగుమతులు, ఎగుమతులు, వాణిజ్య లోటును తగ్గించేందుకు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ విదేశాంగ విధానంలో ఇతర దేశాలను లొంగదీసుకునే ప్రధాన ఆయుధంగా అమెరికా ఉపయోగిస్తోంది. రష్యా చమురు కొనుగోళ్లు, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఫెంటానిల్ నియంత్రణ, అణు కార్యక్రమాలు, జాతీయ భద్రత వంటి కీలక భౌగోళిక రాజకీయ సమస్యలపై వివిధ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ సుంకాలు, ఆంక్షలను యథేచ్ఛగా ప్రయోగిస్తోంది. దీనివల్ల భారత్, చైనా, కెనడాతో పాటు యూరప్ దేశాల సరఫరా గొలుసు తీవ్ర అనిశ్చితిలో పడింది. భారతదేశం విషయానికి వస్తే.. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది.

 Trump targets with tariffs

Trump targets with tariffs : ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వాణిజ్య చర్చలు

భారత ఉత్పత్తులపై మొదట 25 శాతం పరస్పర సుంకాన్ని.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం డ్యూటీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతుల నిరోధం (Section 301) కింద మరో 10 శాతం సుంకం భారాన్ని భారత్ ఎదుర్కొంటోంది. కాగా ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇటు చైనాతో కూడా అమెరికా వివాదం తీవ్ర రూపం దాల్చింది. మారణాయుధంగా మారిన ఫెంటానిల్ రసాయనాల అక్రమ సరఫరాను అరికట్టడంలో బీజింగ్ విఫలమైందనే ఆరోపణలతో చైనా ఉత్పత్తులపై అదనపు పన్నులు పడ్డాయి.

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha