ప్రస్తుత ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై పడుతున్న ఒత్తిడి, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, యూరప్‌ల మధ్య బంధం అత్యంత కీలకంగా మారనుంది.
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ నగరంలో వోల్వో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన “యూరోపియన్ సీఈఓ రౌండ్‌టేబుల్” సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాలను నొక్కి చెప్పారు. ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఇరు పక్షాలు కలిసి నడవాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ సంయుక్త ఆతిథ్యం వహించిన ఈ సదస్సులో యూరప్‌కు చెందిన దిగ్గజ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Ebola Virus Outbreak: ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
PM Modi in Sweden
PM Modi in Sweden: ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్
భారతదేశం ప్రస్తుతం టెక్నాలజీ, ఆవిష్కరణలలో దూసుకుపోతోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కలిగున్న భారత్.. కృత్రిమ మేధస్సు (AI), ఫిన్‌టెక్, అంతరిక్ష పరిశోధనలు, డ్రోన్లు మరియు మొబిలిటీ వంటి అత్యాధునిక రంగాలలో ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందిస్తోందని వివరించారు. గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్’ (సంస్కరణ, పనితీరు, పరివర్తన) అనే మంత్రం దేశ వృద్ధికి కొత్త ఊపునిచ్చిందని చెప్పారు. యువ జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని యూరప్ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించారు. భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య బంధం ప్రస్తుతం ఒక వ్యూహాత్మక మలుపులో ఉందని, ఇరు పక్షాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇందుకు ప్రధాన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని త్వరగా అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనితో పాటు రక్షణ, భద్రత, మొబిలిటీ రంగాలలో కుదిరిన నూతన ఒప్పందాలు ఇరు దేశాల సహకారానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

