Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు

భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు

వార్త 1 week ago

Essential Goods Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 3 రూపాయలు పెరిగాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల నాలుగేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెంపు వల్ల సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Read also: Gold : బంగారం దిగుమతులపై పరిమితి!

 Petrol and daily goods price rise

Essential Goods Price: నిత్యావసరాలపై రవాణా సెగ

డీజిల్ ధర పెరగడం వల్ల లారీలు, వాహనాల రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, పండ్లు, పప్పుధాన్యాల మీద పడుతుంది. రవాణా ఖర్చు పెరిగితే మార్కెట్లో వస్తువుల రేట్లు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం ముప్పు

గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా రేట్లు మార్చకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధరల సవరణ జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగి మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ ధరల మార్పు అనివార్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha