Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు..కారణం అదేనా ?

భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు..కారణం అదేనా ?

వార్త 2 weeks ago

Gold : దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరడం పసిడి కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q-2: ఏప్రిల్ – జూన్) భారత దేశంలో పసిడి డిమాండ్ ఏకంగా 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైంది. పెరిగిన ధరల భారాన్ని తట్టుకోలేక వినియోగదారులు ముఖ్యంగా బంగారం ఆభరణాలు కొనడానికి వెనుకడుగు వేశారు. దీంతో నగల డిమాండ్ ఏకంగా 15 శాతం మేర పడిపోయింది. అయితే, పరిమాణం పరంగా (In Volume) కొనుగోళ్లు తగ్గినా.. ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్ల కారణంగా ఏప్రిల్-జూన్ కాలంలో పసిడి కొనుగోళ్ల విలువ మాత్రం ఏకంగా రూ. 1.98 లక్షల కోట్ల కొత్త రికార్డును నమోదు చేయడం గమనార్హం.

మే – జూన్ మధ్య టన్నుల కొద్దీ బంగారం జప్తు

ఒకవైపు ఆభరణాల విక్రయాలు తగ్గి డిమాండ్ మందగించగా, మరోవైపు అధిక ధరలు మరియు దిగుమతి సుంకాలను ఆసరాగా చేసుకుని దేశంలోకి పసిడి స్మగ్లింగ్ గణనీయంగా పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటడంతో అక్రమ రవాణాదారుల దందా ముమ్మరమైంది. మే 13 నుంచి జూన్ చివరి వరకు గల స్వల్ప వ్యవధిలోనే అధికారులు ఏకంగా 160.91 కిలోల సరిహద్దు దాటించిన బంగారం స్వాధీనం చేసుకున్నారని డబ్ల్యూజీసీ నివేదిక స్పష్టం చేసింది. రాబోయే పండుగల సీజన్‌ నాటికి ధరల్లో స్థిరత్వం వస్తేనే మళ్లీ కొనుగోళ్లలో పూర్వవైభవం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేడు భారీగా తగ్గిన వెండి.. బంగారం ధరలు ఇలా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha