Dailyhunt
భార్యపై కోపంతో 9 నెలల పసికందును నరికి చంపిన తండ్రి!

భార్యపై కోపంతో 9 నెలల పసికందును నరికి చంపిన తండ్రి!

వార్త 2 weeks ago

Sultanpur Crime: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. కన్నప్రేమను మరిచిన ఒక తండ్రి, క్షణికావేశంలో తన 9 నెలల పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు.

భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది.

Read Also:Farrukhabad Thar Car Accident: మనవడి అజాగ్రత్తకు బామ్మ బలి! ఫరూఖాబాద్‌లో ఘోర ప్రమాదం

Sultanpur Crime: అసలేం జరిగింది?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శంభుద్యాల్ కోరి.. తన భార్య రంజు మధ్య ఓ చిన్న విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శంభుద్యాల్ ఆవేశంలో ఇంట్లోని గొడ్డలిని తీసుకున్నాడు. తన ముందు ఉన్న 9 నెలల కొడుకు శివాంశ్‌ను దారుణంగా నరికాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోవడంతో తల్లి అల్లాడిపోయింది.

 Sultanpur man kills daughter with axe updates

సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు శంభుద్యాల్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. దీన్ని నిర్ధారించేందుకు పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. పసికందు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

యూపీలో భారీ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha