Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భాషపై పట్టు అభ్యసనకు ఆయువుపట్టు

భాషపై పట్టు అభ్యసనకు ఆయువుపట్టు

వార్త 5 days ago

Language : విద్యార్థులు తమ వయసు, తర గతి స్థాయి సామర్ధ్యాలు సాధిం చడానికి ప్రతి సబ్జెక్టు చదవడానికి అవగాహన రావడానికి భాష దానిని క్షుణ్నంగా చదవడం అనివార్యం.

అనగా ప్రతి సబ్జెక్టులోనూ భాషను మనం ప్రధానంగా చూడాలి. అనగా చదువు మాతృభాషలో వున్నా ఆంగ్ల భాషలో వున్నా ఆ భాషపట్ల పిల్లలకు పట్టుఉండాలి. ఈపట్టుకు తొలిమెట్టు యనే ప్రాథమికస్థాయి నుండి మౌలిక భాషలో కనీససామర్ధ్యాలను సాధించేలా విద్యార్థులను తీర్చి దిద్దాలి. అందుకు కావలసిన వసతులను, వనరులను, వినూ త్న విద్యార్థులకు స్నేహపూరిత వాతావరణంలో అభ్యస నను అందించడానికి పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలి. కోవిడ్కన్నా ముందు తర్వాత కూడా పాఠశాల విద్యార్థులు తరగతి స్థాయి విద్యాసామర్థ్యాలు సాధించలేక పోతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులభవిష్యత్తు క్లిష్ట తరమోతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తునే వున్నా యి. అందుకే పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఈదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయకపోతే బాలల బంగారు భవిష్యత్తు చిక్కుల్లో పడుతుందనేది వాస్తవం.

 Language

Language : నూతన విద్యావిధానం 2020

విద్యాహక్కు చట్టం 2009 ద్వారా ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పాఠశాలల నమోదు పెరిగింది తద్వారా నాణ్యమైన విద్యాప్రణాళికల్లో భాగంగా మౌలికసదుపా యాలు, ఉపాధ్యాయుల నియామకం చట్టబద్దంగా కల్పిం చాల్సిన. అవసరాలను గుర్తించాం. అక్షరాస్యత అంటే తెలియని కుటుంబాలలో బడివైపు చూడని, ఆర్ధిక సాంఘిక పరిస్థితుల వలన బడిమానేసిన పిల్లలను అక్కున చేర్చు కొనేలా విద్యాహక్కు చట్టాన్ని 2010 నుండి అమలు చేస్తున్నాం. నాణ్యమైన తరగతులను నిర్మించడానికి నూతన విద్యావిధానం 2020ను కూడా రూ పొందించుకున్నాం. కానీ ప్రతి విద్యార్థిలోనూ అభ్యసనాలేమి కనిపిస్తూనే ఉంది. తరగతి వారీ సామర్ధ్యాలు సాధించలేక సతమోతూనేవున్నా రు. 5వ తరగతిలో ప్రవేశించినప్పటికీ 2వ తరగతి పాఠ్యం శాలను కూడా చదవలేని లేదా కనీస గణిత సామర్ధ్యాలను సాధించలేని విద్యార్థుల పరిస్థితిని మనం ళ్లారాచూస్తూనే. మూడవతరగతిలో 10మందిలో 6 మంది విద్యార్థులు చిన్న కథలను కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే పరి స్థితి అన్ని తరగతుల్లోనూ పునరావృతం అవుతుంటే, ఆకోవకు చెందిన విద్యార్థులు చదువు కాలమంతా ఒక విషవలయం లో చిక్కుకుపోవడం అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఈపరిస్థితులకు ప్రధాన కారణం ప్రాథమిక స్థాయిలో పునాది కొరవడడమా లేక సిలబస్వైపే పాఠశాలలు పరుగు లెత్తడమాయనేది విశ్లేషించుకోవాలి.

బాలల భవిష్యత్తు సమస్యల వలయం

ఈమధ్యనేఎన్.సి.ఆర్.టి నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 75శాతం మంది 9 వ తరగతి విద్యార్థులు చిన్నచిన్న కాన్సెప్టను కూడా అర్థం చేసుకోని దుస్థితిలో ఉన్నారు. సుమారు 47 శాతం 3వ తరగతి విద్యార్థులు చిన్నకథను కూడా చదివి అర్థం చేసు కోలేని స్థితిలో వున్నారు. 36 శాతం మంది విద్యార్థులు కూడికలు కూడా చేయలేక పోతున్నారు. 6 వ తరగతిలో సుమారు 34శాతం మంది స్థానికసంస్థలు, మార్కెట్, ఇతర సంస్థల పనిగురించి కుడా తెలియపరచలేకపోయారు. 9వ తరగతి విద్యార్థులు సుమారు 55 శాతంమంది సోషల్ స్టడీస్లో రాజ్యాంగం గురించి, వాటి సూత్రాలు జాతీయ ఉద్యమాల గురించి వెల్లడించలేని పరిస్థితిలో వున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 9వ తరగతిలో 17వ స్థానంలో, 6వ తరగతిలో 26వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు క్షుణ్నంగా పరిశీలిస్తే ఎవరికైనా అవగతమయ్యేది, విద్యార్థికి చదవడం, విషయాన్ని అర్ధం చేసుకోవడంలో ముందుంటే తద్వారా అభ్యసనా సామర్ధ్యాలు సాధించంచడం చాలా సులభమని, దీనితో బాటు గణితంలో కనీసం చతుర్విధ ప్రక్రియలు సాధించడంలో ప్రవేశం ఉంటే విద్యార్థి ప్రగతి సులభతరమోతుందనేది వాస్తవం. ప్రతివిద్యార్థికి పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పునాది ఏర్పరచాలి. పునాది కొరవడితే బాలల భవిష్యత్తు సమస్యల వలయంలో చిక్కు కుంటుంది. పిల్లలు భాషపై పట్టు సాధించినప్పుడే మిగతా సబ్జెక్టులపై తగిన ఫలితాలు చాలా సులభంగా సాధించగలు గుతారు.

సొంత మాటల్లో చెప్పడం ప్రతిస్పందించడం తప్పనిసరి

ప్రాథమిక విద్యలో అభ్యసనమంటే భాషపై తగిన పట్టు కలిగి ఉండడమేయని జాతీయ విద్యాచట్రం 2005 వక్కాణించింది. ఈ పునాదులపైననే పిల్లల మానసిక అభి వృద్ధి ఆధారపడి ఉంటుంది . విద్యార్థులు చదవడం అంటే ధారాళంగా చదవడం, చదివిన దానిని అర్ధం చేసుకొని తన సొంత మాటల్లో చెప్పడం ప్రతిస్పందించడం తప్పనిసరి. ఈవిధంగా విద్యార్థికి భాషలో ఎక్కువ సామర్థ్యాలు సాధిం చడానికి భాషాభ్యాసానికి అవసరమైన అదనపు సామాగ్రి, బాలలసా హిత్యం, వార్తపత్రికలు, మాగజైన్లు చదివేలా విద్యా ర్థులను తప్పక ప్రోత్సహించాలి. ఈప్రక్రియ చదువులో ముందంజ వేయడానికి, వ్యక్తిగత అభివృద్ధికి విజ్ఞాన ప్రపం చంలో ఎన్నో కొంగొత్త విషయాలను ఆకళింప చేసుకొని మెరుగైన భవిష్యత్తును గడించడానికి అవసరమైన విషయ విశ్లేషణ, సమస్యాత్మక విషయాలను పరిష్కరించే పరిజ్ఞానం, తనకుతాను ఎదగడానికి పత్రికలు గ్రంథాలయాలో అందు బాటులో వున్న పుస్తకాల పఠనం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్ధి తన పాఠ్యంశాలకే పరిమితం కాకుండా, గ్రంథాల య పుస్తకాల పఠనం, పుస్తకసమీక్ష ఇవన్నీ నిత్యజీవితంలో అంచెంచెలుగా ఎదగడానికి వెసులుబాటు కల్పించాలి. అయితే పిల్లలు పుస్తక పఠనచేయడానికి, తరచూ తాను చదివిన లేదా నేర్చుకున్న విషయాలను చర్చించడానికి, తెలియపరచ డానికి ఉపాధ్యాయులు, తలిదండ్రులు, తగిన అవకాశాలను పిల్లలకు ఏర్పరచాలి.

 Language

పాఠ్యంశాలపైనే దృష్టిసారించడం

స్క్రీన్ చదువులు మొబైళ్లపై ఆధార పడుతున్నారు. పుస్తకాలను తాకి, పేజీలు తిప్పి విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదివే ప్రక్రియకనుమరుగైపోయిం ది. దీనివలన కంటికి అలసట, ఒత్తిడి, అవసరమైన పాఠ్యం శాలపైనే దృష్టిసారించడం వంటి మారు స్త్రీల వేటలో పిల్లలు పాఠ్యంశాల పరిధి దాటి ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, అంటే పిల్లల చదువును పాఠ్యప్రణాళిక స్థాయివరకే పరిమితం చేయడం జరుగుతున్నది. అదనంగా గ్రంథాలయ పుస్తకాలు చదవడం పాఠ్యప్రణాళికకు మించి పరిజ్ఞానం కోసం జీవననైపుణ్యాల మెరుగుదలను పెం పొం దించే పుస్తక సామాగ్రి అందుబాటులో ఉండకపోవడం ఉన్న ప్పటికీ వినియోగంలో సమయాభావం, ఇవన్నీ వెరసి పిల్లల అభ్యసనకు అవరోధాలు ఏర్పడ్డాయి. కారణాలేమైనప్పటికీ విద్యార్థులు తమ వయసు, తరగతిస్థాయి సామర్థ్యాలుసాధిం చడంలో బాగా వెనుకబడి వున్నారు. డిజిటల్ యుగంలో మొబైల్, టెలివిజన్వైపు తక్కువ సమయాన్ని కేటాయించేలా తలిదండ్రులు తమపిల్లలను చైతన్యపరచాలి. తద్వారా పిల్ల ల్లో పఠనాశక్తిని పెంపొందిందించడం ద్వారా అభ్యసనా సామర్థ్యాలతో ప్రగతి సాధించడం సుసాధ్యమోతుంది.

-మల్లాడి శ్రీనగేష్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

జూలై 10న ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha