Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

వార్త 6 days ago

Bhadrachalam : ఎగువ జలానయన ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయానికి నది నీటిమట్టం 53 అడుగుల మార్కును తాకడంతో అధికారులు తక్షణమే మూడో ప్రమాద హెచ్చరికను (Third Danger Warning Signal) జారీ చేశారు.

ప్రస్తుతం భద్రాచలం వద్ద నదీ ప్రవాహం సుమారు 14,26,684 క్యూసెక్కులకు చేరి నిమిషనిమిషానికి ఉధృతి పెరుగుతుండటంతో తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

 Minister Seethakka

లంక గ్రామాలకు పొంచివున్న ముప్పు - పునరావాస కేంద్రాలకు తరలింపు

వరద ప్రవాహం విపరీతంగా పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు లంక గ్రామాల ప్రజలను యంత్రాంగం తీవ్రంగా అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర సూచనలు చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF), ఆర్‌డిఓ మరియు పోలీస్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నాయి. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

ప్రతి మహిళా గ్రామీణ పారిశ్రామికవేత్తగా ఎదగాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha