Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ కు సపోర్టు చేస్తే మీ పై కేసు నమోదైనట్లే !

భగీరథ్ కు సపోర్టు చేస్తే మీ పై కేసు నమోదైనట్లే !

వార్త 1 week ago

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, బాధితురాలైన మైనర్ బాలికను తప్పుబడుతూ కంటెంట్ క్రియేట్ చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు. చట్టప్రకారం మైనర్ల హక్కులను ఉల్లంఘించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ చర్య ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పరిణామం డిజిటల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also : ఇందిరమ్మ వరమిచ్చింది.. కరెంటు స్తంభం శాపమైంది!

డబ్బులు తీసుకుని పెయిడ్ కంటెంట్

నిందితుడు బండి భగీరథ్‌కు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన సదరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉచితంగా ఈ పని చేయలేదని, దీని వెనుక పెద్ద ఎత్తున డబ్బుల చేతులు మారాయనే గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దిష్టమైన పీఆర్ (PR) ఏజెన్సీల ద్వారా భారీగా నగదు తీసుకుని, బాధితురాలిని దోషిగా చిత్రీకరిస్తూ వీరంతా పెయిడ్ కంటెంట్, వీడియోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పేట్ బషీరాబాద్ పోలీసులు సదరు యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. పేయిడ్ ప్రమోషన్ల పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

పోలీసుల సీరియస్ వార్నింగ్!

పోక్సో చట్టం నిబంధనల ప్రకారం వేధింపులకు గురైన మైనర్ బాలికల గుర్తింపును, ముఖాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదు. అయితే ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా షేర్ చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ మరియు లోకల్ పోలీసులు ప్రత్యేక కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైకుల కోసం లేదా రాజకీయ లబ్ధి కోసం బాధితుల వివరాలను షేర్ చేస్తే కఠినమైన జైలు శిక్ష తప్పదని పోలీసులు నెటిజన్లను హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎస్సీ వర్గీకరణ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha