Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ లొంగిపోలేదు.. మా పోలీసులు అరెస్ట్ చేశారు: సీఎం

భగీరథ్ లొంగిపోలేదు.. మా పోలీసులు అరెస్ట్ చేశారు: సీఎం

వార్త 3 days ago

CM Revanth Reddy: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు నిబంధనల ప్రకారం, పద్ధతిగా దర్యాప్తు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భగీరథ్ లొంగిపోలేదని, పోలీసులు అతడిని అరెస్టు చేశారని సీఎం వివరించారు. పోలీసుల తనిఖీల్లోనే బండి భగీరథ్ దొరికాడని అధికారులు తనకు తెలిపారని, తాను పోలీసుల మాటలనే నమ్ముతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also : CM Revanth Reddy: కొడంగల్ రూపురేఖలు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి

 Bandi Bhagirath was arrested by the police.. CM Revanth

CM Revanth Reddy: కేటీఆర్, ప్రవీణ్ కుమార్‌లు జడ్జీలుగా మారారు: సీఎం

గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ్‌ కేసులో వీరిద్దరూ జడ్జీలుగా మారిపోయి ముందే తీర్పులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ చట్టాల ప్రకారం పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉందని, కానీ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

బాధితుల ఆవేదన పట్టదా?

బీఆర్ఎస్ నాయకులు బాధ్యత లేకుండా రోడ్డుమీద పడి మాట్లాడుతున్నారని, వారి తీరు వల్ల బాధిత కుటుంబం ఎంతటి మానసిక ఆవేదనకు గురవుతుందో ఆలోచించారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా బాధితులకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే తేవాలి.. సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha