Srisailam: అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రం భక్తులతో కిక్కిరిసి పోయింది.
వేసవి సెలవులు కావడంతో భక్తులు శ్రీశైలం కు పోటెత్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. ఈ క్రమంలో రాకపోకల్లో వాహనాల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా మల్లన్న దర్శనార్థం క్యూలైన్లో ఉన్న భక్తులకు దైవ దర్శనం గంటల తరబడి ఆలస్యంగా సాగుతుంది. రద్దీకి అనుగుణంగా దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు భక్తుల కొరకు ఏర్పాట్లను చేశారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు,మజ్జిగ అందించడం జరుగుతుంది. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం అధికారులతో ఈవో ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
అమావాస్య సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

