Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

వార్త 16 hrs ago

Nagarkurnool Crime: నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం ఉదయం ఒక కలకలం రేపే విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రేమించుకున్న ఓ వివాహిత, ఆమె మాజీ ప్రియుడు కలిసి గ్రామ శివారులోని మామిడి తోటలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

 Lovers Suicide Nagarkurnool

Read also: Tummala Nageswara Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్

పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లి.. అయినా తీరని బంధం!

పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన శివ (25), రేణుక (23) గతంలో ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరువైపులా ఉన్న పెద్దలు అంగీకరించలేదు. దీంతో రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులు రేణుకకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమెకు ఒక ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది.

Nagarkurnool Crime: భర్త మందలించాడని పుట్టింటికి.. అర్ధరాత్రి దారుణం!

పెళ్లయినప్పటికీ వీరిద్దరి మధ్య పరిచయం కొనసాగినట్లు తెలుస్తోంది. ఇటీవల రేణుక తన మాజీ ప్రియుడు శివతో ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త చూసి తీవ్రంగా మందలించాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన రేణుక, వారం రోజుల క్రితం భర్త ఇల్లు వదిలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యుల కళ్లు గప్పి ఆమె ఇల్లు దాటి బయటకు వచ్చేసింది. కాసేపటికి చిన్నారి ఏడవడంతో మేల్కొన్న ఇంట్లోని వారు రేణుక కనిపించకపోవడంతో రాత్రి అంతా వెతికారు.

తెల్లవారేసరికి గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో రేణుక, శివ ఇద్దరూ ఒకే చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. ఏడాది వయసున్న కన్నబిడ్డను వదిలేసి తల్లి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha