Hyderabad Techie Suicide: హైదరాబాద్‌లోని మూసాపేట పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త తనతో తగినంత సమయం గడపడం లేదనే మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కడప జిల్లాకు చెందిన దంపతులు..
బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చందనాజ్యోతి (25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమెకు వెంకటసాయి యశ్వంత్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉద్యోగ రీత్యా ఈ దంపతులు హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసముంటున్నారు. చందనాజ్యోతి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తుండగా, భర్త ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి వస్తుండేవాడు.
Read Also : Kushaiguda Accident: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టిన కారు
Young woman commits suicide over husband not giving her time
Hyderabad Techie Suicide: భర్తతో గొడవలు.. తీవ్ర నిర్ణయం
ఇంటి వద్దే ఉంటున్న చందనాజ్యోతి, రోజూ ఆఫీసుకు వెళ్తున్న భర్త యశ్వంత్ తనతో తగినంత సమయాన్ని కేటాయించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతుండేవి. శనివారం తెల్లవారుజామున మనస్తాపం చెందిన ఆమె, భర్త గమనించని సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

