Mouni Roy: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. 2022లో దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె, ప్రస్తుతం అతనితో విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన కొన్ని పరిణామాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.
Read Also: Tamanna : 'భస్మ హారతి' సేవలో తమన్నా..ఏంటి ఈ మార్పు !!
Bollywood actress who unfollowed her husband.. Are those rumors true?
Mouni Roy: సోషల్ మీడియాలోఅన్‌ఫాలో
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గతంలో తరచుగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసే మౌనీ, కొన్నాళ్లుగా అలాంటి పోస్టులేవీ చేయలేదు. మరోవైపు, సూరజ్ తన ఖాతా నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను తొలగించడం చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా, మే 12వ తేదీన అందిన తాజా సమాచారం ప్రకారం.. సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్ అత్యంత సన్నిహితురాలు, నటి దిశా పటానీ కూడా సూరజ్‌ను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది మౌనీరాయ్. ముఖ్యంగా నెగెటివ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభరలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందీ. దీంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే మౌనీరాయ్ వ్యక్తిగత జీవితంలో కలకలం రేగింది. సినిమా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో భర్తని అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్‌కి కారణం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

