Chodavaram Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు దశాబ్దాల దాంపత్య జీవితం అనుమానం అనే భూతానికి బలై విషాదాంతంగా ముగిసింది.
అనుమానంతో భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేసిన అంగన్‌వాడీ కార్యకర్త, అనంతరం మృతదేహం వద్ద దీపం పెట్టి పోలీసులకు లొంగిపోయింది.
Read Also :West Godavari Car Accident: కాలువలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు యువకులు గల్లంతు
Chodavaram Crime: అనుమానంతో 30 ఏళ్ల దాంపత్య జీవితం విషాదాంతం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం రామ్మోహనరావుపేట సమీప అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు కాగా, ఒకరికి వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో పనిచేస్తుండగా, ఇందిర స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తోంది. అయితే, వెంకటరావుకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
శనివారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున అనకాపల్లిలోని కుమార్తె ఇంటి నుంచి వచ్చిన వెంకటరావుతో ఇందిర మళ్లీ గొడవపడింది. ఆయన ఆ మహిళ వద్ద నుంచే వచ్చాడనే ఆవేశంతో కత్తితో భర్త గొంతు కోసి హత్య చేసింది. స్థానికంగా మహిళలకు కుటుంబ, ఆరోగ్య అవగాహన కల్పించే అంగన్‌వాడీ కార్యకర్తే ఈ దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వర్జీనియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

