Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భట్కల నదిలో విషాదం: ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

భట్కల నదిలో విషాదం: ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

వార్త 10 hrs ago

Karnataka news: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. భట్కల సమీపంలోని తత్తెహక్కలు నదిలో వేట కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది నీటిలో గల్లంతయ్యారు.

గాలింపు చేపట్టిన సహాయక బృందాలు ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులందరూ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

Read also: China Alcohol Trends: చైనా మద్యం మార్కెట్.. బైజియును వెనక్కి నెడుతున్న విస్కీ?

 8 family members died in Bhatkal river

కొనసాగుతున్న గాలింపు చర్యలు

సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత్యువాత పడిన కుటుంబ సభ్యుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు నదిలో విస్తృత శోధన చేస్తున్నారు. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.

Karnataka news: గ్రామంలో విషాద ఛాయలు

సిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం ఇలా అకస్మాత్తుగా నదిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధితులకు తగిన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha