Sangareddy News: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని సుల్తాన్పూర్, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్పూర్‌లో శిక్షణ, ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో గురువారం "స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ ఐటీ వర్క్ఫోర్స్" అంశంపై సెమినార్ నిర్వహించారు.
బీటెక్ చివరి సంవత్సరం ఈసీఈ, సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ & ఎంఎల్) విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also : Telangana pensions: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ
Skills are key to future IT jobs.
Sangareddy News: ఉపాధి అవకాశాలు, సాంకేతిక మార్పులపై నిపుణుల అవగాహన
ఈ సందర్భంగా ఫుల్ స్టాక్ విత్ ఏఐ ట్రైనర్ రాజ్‌కుమార్, జావా బ్యాకెండ్ డెవలపర్ వివేక్, ఏఐ ఇంజినీర్ నిఖిల్, వీఎల్ఎస్ఐ ఇంజినీర్ కిరణ్ ఐటీ రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, కృత్రిమ మేధస్సు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా, వీఎల్ఎస్ఐ వంటి రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్టులు, కోడింగ్ పోటీలు, పరిశ్రమ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ కోర్సుల్లో పాల్గొనాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి డా. ఎం. శైలజ మాట్లాడుతూ పరిశ్రమ ఆధారిత శిక్షణ, ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం ప్లేస్మెంట్లలో విజయానికి కీలకమని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు కెరీర్ ప్రణాళిక, ఉన్నత విద్య, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ సన్నద్ధతపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి పరిశ్రమ ఆధారిత కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
"ఓటు లేకపోతే పథకాలూ రావు": ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

