Chandrababu Naidu Nellore speech: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోకి రాబోయే అన్ని రకాల ఏసీ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సంచలన ప్రకటన చేశారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకంపై కూడా సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ పథకం కింద అర్హులైన తల్లులకు అందించే ఆర్థిక సహాయం పంపిణీ తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా నిర్ణయించి, ప్రకటిస్తుందని సభ ముఖంగా హామీ ఇచ్చారు. ఈ లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: AP EAPCET Results 2026: మరి కాసేపట్లో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
Free travel in all AC buses in the future: CM Chandrababu
Chandrababu Naidu Nellore speech: వైసీపీ సోషల్ మీడియా వేధింపులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
విజయవాడ కేంద్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కుల రాజకీయాలకు తెరలేపుతోందని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక, ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆయన కూతుళ్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని ఎంత అవసరమో సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, భవిష్యత్ తరాలకు ఒక శాశ్వత రాజధాని అవసరం. కానీ, ఆ గొడ్డలి పార్టీకి మాత్రం రాజధానితో పనిలేదు అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Epaper: epaper.vaartha.com

