Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది.
రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో వారికి వీవీఐపీ (VVIP) గ్యాలరీలో ప్రత్యేకంగా ఆసనాలు కేటాయించారు.
భోగాపురం మండలంలోని గూడెపువలస, రావాడ, కంచేరు, కవులువాడ, ఎ. రావివలస, సవరవిల్లి, ముంజేరు గ్రామాల రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం స్వచ్చందంగా భూములిచ్చారు. రైతులు 403 మంది, ఇళ్లు ఇచ్చినవారు సుమారు 1,600 మంది వరకు ఉంటారు. రెండూ ఇచ్చినవారు 200 మందికి పైగా ఉంటారని అంచనా. వీరందరికీ ఒకసారి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతులను విమానంలో హైదరాబాద్ తీసుకెళ్తారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించక ముందు పరిస్థితి.. తర్వాత చుట్టుపక్కల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూపించి, వారికి వివరిస్తారు.
Bhogapuram Airport: Grand felicitation for farmers who gave up their lands.
Bhogapuram International Airport: 1,600 మంది రైతులకు ఘన సత్కారం
ఈ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన మొత్తం 1,600 మంది రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ప్రభుత్వాధికారులు వారిని ఘనంగా సత్కరించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతపు కలల ప్రాజెక్టు అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో రైతులు అందించిన అపారమైన సహకారాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

