Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. నవంబర్ 21 నుంచి అమలు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. నవంబర్ 21 నుంచి అమలు!

వార్త 3 weeks ago

Visakhapatnam Airport: విశాఖపట్నం ప్రాంతానికి సేవలందిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ప్రయాణికులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయానికి సంబంధించిన నగరం పేరును మార్చాలని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో భోగాపురం పేరుతో కనిపిస్తున్న ఈ విమానాశ్రయం.. నవంబర్ 21 నుంచి విశాఖపట్నం పేరుతో కనిపించనుంది. అయితే విమానాశ్రయానికి కేటాయించిన VTZ కోడ్ మాత్రం మారదు.

Weather updates: నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.

అసలు గందరగోళం ఎక్కడ వచ్చింది?

గతంలో విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ డేగా వద్ద ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి విమాన సర్వీసులు నడిచేవి. ఆ విమానాశ్రయానికి VTZ అనే IATA కోడ్ ఉండేది. అనంతరం భోగాపురంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పాత విమానాశ్రయంలోని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసి, VTZ కోడ్‌ను కొత్త విమానాశ్రయానికి అనుసంధానించారు. అయితే కొత్త విమానాశ్రయం భౌగోళికంగా భోగాపురంలో ఉన్నప్పటికీ, విశాఖపట్నం నగరానికి సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో VTZ కోడ్ పక్కన భోగాపురం పేరు కనిపించడంతో ప్రయాణికుల్లో సందేహాలు మొదలయ్యాయి. కొందరు VTZ కోడ్‌ను చూసి విమానాశ్రయం విశాఖ నగరంలోనే ఉందని భావించే అవకాశం ఉంది. వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నవంబర్ 21 నుంచి విశాఖపట్నం పేరుతో..

ఈ గందరగోళాన్ని తొలగించేందుకు IATA కీలక మార్పు చేపట్టినట్లు సమాచారం. నవంబర్ 21, 2026 నుంచి విమానాశ్రయానికి సంబంధించిన నగరం పేరును భోగాపురం నుంచి విశాఖపట్నంగా మార్చనున్నారు. అంటే విమాన టికెట్ల బుకింగ్ సమయంలో VTZ కోడ్‌తో పాటు విశాఖపట్నం పేరు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. విమానాశ్రయ కోడ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. VTZ కోడ్ యథాతథంగా కొనసాగుతుంది. కేవలం బుకింగ్ వ్యవస్థల్లో చూపించే నగరం పేరు మాత్రమే మారుతుంది.

Visakhapatnam Airport: ప్రయాణికులకు కలిగే ప్రయోజనం ఏమిటి?

ఈ మార్పుతో విమాన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులకు స్పష్టత పెరుగుతుంది. విశాఖపట్నం వెళ్లాలనుకునే వారు VTZ కోడ్‌ను సులభంగా గుర్తించగలుగుతారు. భోగాపురం, విశాఖపట్నం పేర్ల కారణంగా ఏర్పడుతున్న గందరగోళం తగ్గే అవకాశం ఉంది. అయితే విమానాశ్రయం భౌగోళికంగా భోగాపురంలోనే ఉంటుంది. కాబట్టి టికెట్‌లో విశాఖపట్నం అని కనిపించినా, ప్రయాణికులు విమానం ఎక్కేందుకు భోగాపురంలోని కొత్త విమానాశ్రయానికి చేరుకోవాలి. అందువల్ల ప్రయాణానికి ముందే విమానాశ్రయ చిరునామా, ప్రయాణ సమయం, రవాణా సౌకర్యాలను పరిశీలించుకోవడం మంచిది.

Epaper: epaper.vaartha.com

నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. తుఫాన్ నష్టాలపై ఆరా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha